ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ ఇంట విషాదం అలుముకుంది. అతని 16 ఏళ్ల కుమార్తె మీరా మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపద్యంలో తమిళ చిత్ర పరిశ్రమ అంతా విజయ్ ఆంటోనీ కి బాసటగా నిలిచి మేమున్నాం అని అందరూ సాంఘీక మాధ్యమంలో తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. అలాగే చాలామంది విజయ్ ఆంటోనీ ఇంటికి వెళ్లి అతనికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నారు. అసలు చిన్న పిల్లలు ఇలా చేసుకోకూడదు అని, ఏమైనా ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలని , మేమున్నది మీ కోసమే, మేము కష్టపడుతున్నది కూడా మీ సంతోషం కోసమే అని జయం రవి తన మెసేజ్ లో సోషల్ మీడియా వేదికగా స్పందించారు.