ముంబై భామలకు ఏమాత్రం తగ్గని గ్లామర్ ఈషా సొంతం. అయితే దర్శక నిర్మాతలే గుర్తించడం లేదు. చెప్పాలంటే ఈషాను టాలీవుడ్ సరిగా ఉపయోగించుకోవడం లేదు. తాజాగా బ్లాక్ ట్రెండీ వేర్లో సాలిడ్ అందాలు ప్రదర్శించింది. హాట్ థైస్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. కవ్వించే పోజులు చెమటలు పట్టిస్తున్నాయి. సోషల్ మీడియా జనాలు వెర్రెత్తిపోతున్నారు. ఇక క్రేజీ కామెంట్స్ తో ఈషా ఫోటో షూట్ వైరల్ చేస్తున్నారు. ఈషాకు కాలం కలిసిరాలేదు. కెరీర్ ని నిలబెట్టే ప్రాజెక్ట్ దక్కలేదు. అందుకే ఆమె లైమ్ లైట్లో లేకుండా పోయింది. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది. తెలుగులో ఈషాకు ఆఫర్స్ తగ్గాయి. ముఖ్యంగా హీరోయిన్ ఆఫర్స్ రావడం లేదు. ఇటీవల ఈషా దయ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తి భార్య అలివేలు పాత్రలో ఆమె కనిపించారు. ప్రెగ్నెంట్ లేడీగా నటించి మెప్పించారు. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న దయ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. దర్శకుడు పవన్ సాధినేని దయ సిరీస్ రూపొందించాడు. ఆ మధ్య ఓ తమిళ ప్రాజెక్ట్ ప్రకటించింది. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట.కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది.