ముంబై ఎయిర్పోర్ట్లో ఎదురైన చేదు అనుభవంపై నటి శ్రుతి హాసన్ స్పందించారు. ‘‘నేను ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి నా వెంట రావడం గమనించాను. ఫొటో కోసం అనుకున్నాను. కానీ, అతడు నాకు చాలా దగ్గరగా రావడంతో అసౌకర్యంగా అనిపించింది. అందుకే వేగంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాను. నన్ను వెంబడించిన వ్యక్తి ఎవరో తెలియదు’’ అని శ్రుతి హాసన్ చెప్పారు.