బాలీవుడ్ నటి పరిణితి చోప్రా తన స్నేహితుడు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్ఎ అయిన రాఘవ్ చద్దతో ఈ ఆదివారం ఉదయపూర్ లో వివాహం జరగనుంది. ఈ వివాహానికి బాలీవుడ్ నుండి చాలామంది ప్రముఖులు హాజరు కానున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ ఇద్దరి కుటుంబాలకి చెందిన సభ్యులు ఉదయపూర్ చేరుకున్నారు. ఉదయపూర్ లోని 'ది లీలా పాలస్' వీరి వివాహానికి సర్వాంగ సుందరంగా ముస్తాబు అయిందని కూడా అంటున్నారు. పెళ్ళికొడుకు,పెళ్లికూతురు నిన్ననే చేరుకొని అక్కడ ఈ పెళ్లి ఫంక్షన్ మొదలెట్టేసారు. నిన్న అంత కూడా మెహందీ ఫంక్షన్ జరిగినట్టుగా తెలిసింది. ఈరోజు హల్దీ ఫంక్షన్ అలాగే సంగీత్ కూడా ఉంటుందని అంటున్నారు. అయితే పరిణీతి చోప్రా కజిన్ సిస్టర్ బాలీవుడ్, హాలీవుడ్ నటి అయిన ప్రియాంక చోప్రా మాత్రం ఇంకా రాలేదు. ఆమె లాస్ ఏంజెల్స్ లో వున్నట్టుగా తెలిసింది. మరి ఆమె బయలుదేరి వస్తోందా లేదా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అని తెలిసింది.