ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌత్ సినిమాలపై తమన్నా షాకింగ్ కామెంట్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 28, 2023, 11:08 AM

మిల్కీ బ్యూటీ తమన్నా కూడా సౌత్ పరిశ్రమపై  షాకింగ్ కామెంట్స్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమంది.అనాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇక్కడ సౌత్ లో సినిమాలు చేసి గుర్తింపు, డబ్బు పొంది ఇక్కడవారిని విమర్శించటం ,కామెంట్స్ చేయటం ముంబై హీరోయిన్స్ కు కామన్ గా మారింది. ఆ మధ్య తాప్సీ  సౌత్ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ అందరిని ఎలా ఇబ్బందిపెట్టాయో..ఇప్పుడు తమన్నా చేసిన కామెంట్స్ కూడా అలా వైరల్ అవుతున్నాయి.  ఇక్కడ తను చేసిన సినిమాలపై పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది.మొదట్లో హిందీ  సినిమాలతో సినీ ఎంట్రీ ఇచ్చిన తమన్నా అక్కడ వర్కవుట్ కాక.. ఆ తర్వాత  తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి  క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు తరువాత ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించిన ఆమె నటిగా తన ప్రస్థానం 2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో మొదలుపెట్టింది.అయితే అక్కడ ఆమెకు పెద్దగా కలిసిరాకపోయినా ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, ఆ తదుపరి ఏడాది కేడీ సినిమాతో తమిళంలో అడుగు పెట్టింది.  ఇక తమన్నా ప్రస్తుతం ‘బంద్రా’, ‘అరన్మణై4’, ‘వేడా’ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్‌ దక్కించుకుంటూ దూసుకుపోతోంది అందాల తార తమన్నా. కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లో సినిమాలు చేస్తుంది తమన్నా. తెలుగు లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ బ్యూటీ. దక్షిణాది, బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది నటి తమన్నా.తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. నటి కావాలనే ఆశతో పరిశ్రమలోకి అడుగుపెట్టానని.. ఇప్పుడు తానొక స్టార్‌ని అయ్యానని అన్నారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే తాను ఇప్పటికీ శ్రమిస్తున్నానని చెప్పారు. అయితే ఇప్పుడు కొన్ని సినిమాలు వదిలేసుకుంటున్నాను అంది. అందుకు కారణం సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ‘‘అక్కడ పురుషాధిక్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు’’ అంది.అయితే సౌత్‌లో వచ్చినంత ఫేమ్.. తమన్నాకు బాలీవుడ్‌లో రాలేదు. ఆ అంశంపై కూడా తను స్పందించింది.తను సక్సెస్, ఫ్లాప్స్‌ను పర్సనల్‌గా తీసుకోను అని అంది తమన్నా. తను బాలీవుడ్‌లో మొదట్లో చేసిన సినిమాలు వర్కవుట్ అవ్వకపోయినా.. అది తన తలరాత అనుకొని యాక్టింగ్ చేస్తూనే ఉన్నానని చెప్పింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com