ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భగవంత్ కేసరి' USA అడ్వాన్స్ బుకింగ్స్ కి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 30, 2023, 08:11 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'భగవంత్ కేసరి' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ ఖరారు చేసారు. 'ఐ డోంట్ కేర్' అనే ట్యాగ్‌లైన్ ని ఈ సినిమాకి మేకర్స్ లాక్ చేసారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అక్టోబర్ 4వ తేదీన యుఎస్‌లో ప్రారంభం కానున్నాయి. భగవంత్ కేసరి అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ బిగ్గీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 19, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa