జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపుదిద్దుకొనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రారంభమవుతుందని చిత్రనిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ప్రకటించాయి. ఈ చిత్రం కోసం ప్రశాంత్ నీల్ ఓ పవర్ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నారు. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో అవన్నీ రీచ్ అయ్యేలా అంత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర నిర్మాణం శరవేగంతో జరుగుతోంది. అదయ్యాక ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్లో ఆయన పాల్గొంటారు.