తమిళ సినీ హీరో విజయ్‌కు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కు ‘లియో’ సినిమా కారణంగా మధ్య విభేదాలు తలెత్తాయని కోలీవుడ్‌లో వార్తలొచ్చాయి. ఈ విషయంపై లోకేశ్ స్పందిస్తూ...... ఆ కథనాల్లో నిజం లేదని వెల్లడించారు. కేవలం ఎవరో పుట్టించి వదంతులని తెలిపారు. ఆ వార్తలు చూసి ఇద్దరం కామెడీ చేసుకున్నామని తెలిపారు. ఇప్పటివరకూ ఎంతోమంది స్టార్లతో పని చేశా. కానీ విజయ్‌ని మాత్రమే అన్నా అని పిలుస్తానని, తమ మధ్య అంత అనుబంధం ఉందని వివరించారు. ట్రైలర్ గురించి మాట్లాడుతూ ‘‘లియో’ ట్రెలర్‌ను మొదట విజయ్ అన్నకు చూపించా. మూడుసార్లు రిపీట్ మోడ్‌లో చూశారు. గోదాంలో విలనలతో విజయ్ ఫైట్ చేేస సీక్వెన్స్‌ను 20 రోజులు షూట్ చేశాం. నాకు తెలిసినంత వరకూ ఇలాంటి ఫైట్ సీన్‌ను ఆయన ఇప్పటివరకూ చేయలేదు. ‘ఖైదీ’, ‘విక్రమ్’లో చూపించిన విధంగా ఇందులోనూ ఓ బిర్యానీ సీక్వెన్స్ ఉంటుంది’’ అని లోకేశ చెప్పారు.