బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి గాయత్రి గుప్తా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 'ఆర్థరైటిస్' కారణంగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారని, దానికి రూ. 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. దీంతో 'ఇంపాక్ట్ గురు' అనే స్వచ్ఛంద సంస్థ ఆమె కోసం విరాళాలు సేకరిస్తోందట.