దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న 'లియో' సినిమా తెలుగులో బ్రేక్ పడింది. ఈ సినిమా ఈనెల 19న రిలీజ్ కానుండగా.. తెలుగు వెర్షన్ 'లియో'ను ఈనెల 20వ తేదీ వరకూ రిలీజ్ చేయకూడదని హైదరాబాద్ సివిల్ కోర్టు ఆదేశించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇది టైటిల్ హక్కులకు సంబంధించినదని, సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాయి.