టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'భగవంత్ కేసరి' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ ఖరారు చేసారు. ఈ సినిమా అక్టోబర్ 19, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ నుండి U/A సర్టిఫికేట్ పొందగా, సెన్సార్ బోర్డ్ చిత్ర బృందాన్ని కట్స్ కోసం ఎటువంటి అభ్యర్థనలు చేయలేదని లేటెస్ట్ టాక్..
ఈ బిగ్గీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.