బాలీవుడ్ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్ 3’ లో కత్రినా కైఫ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు అదరిపొయే యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించటమే కాదు.. కను రెప్ప వేయకుండా వావ్ అనిపించేంత అందంతో ఆకట్టుకునేంత ఆకర్షణీయంగా ఆమె కనిపించనుంది. దీనికి అక్టోబర్ 23న ఈ చిత్రం నుంచి విడుదలవుతున్న ‘లేకే ప్రభు కా నామ్..’ పాట ఓ ఉదాహరణగా నిలవనుంది. ఆమె ఎంటైర్ కెరీర్లో ఈ సాంగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరేట్ సాంగ్ అని స్వయంగా కత్రినానే చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ.. ‘లేకే ప్రభు కా నామ్’ విజువల్‌గా ప్రేక్షకులను అలా కట్టిపడేస్తుంది. అందుకనే నా ఫేవరేట్ సాంగ్స్‌లో ఇదొకటి. టర్కీలోని కాప్పడోసియా ప్రాంతంలో ఈ పాటను చిత్రీకరించారు. అనితా ష్రాఫ్ అజానియా ఈ పాటలో నన్ను ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ పాటలో నన్ను ఆమె ఏకంగా ఏడు మెస్మరైజింగ్ లుక్స్‌లో చూపించారు. ఈ పాటను చిత్రీకరించిన తీరు.. టైగర్, జోయా మధ్య ఉండే కెమిస్ట్రీ సరికొత్తగా అలరించనుంది. సల్మాన్‌తో కలిసి డాన్స్ చేయటాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తానని తెలిపింది.