టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్-రతిక విడిపోవడానికి గల కారణాన్ని రతిక చెల్లెలు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రతిక చెల్లెలు మాట్లాడుతూ.. ‘రాహుల్, రతిక పెళ్లికి మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. అయితే పెళ్లి అయిన తర్వాత ఇండస్ట్రీలో ఉండొద్దనే కండీషన్ పెట్టారు. అది మా అక్కకు నచ్చలేదు. దాంతో పెళ్లి కుదరదని భావించి ఇద్దరూ విడిపోయారు. విడిపోయిన ఆరేళ్ల తర్వాత ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో తెలియదు.’ అని చెప్పింది.