సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించారు. శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సత్యం రాజేశ్ మీడియాతో ముచ్చటించారు. ‘మా ఊరి పొలిమేర’ సినిమా చూసిన ప్రేక్షకులు సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి భాగం పరిమిత బడ్జెట్లో పూర్తి చేశాం. కానీ సీక్వెల్‌ను మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించాం. నటుడిగా నన్ను కొత్తకోణంలో చూసుకునే అవకాశం ఈ చిత్రంతో లభించింది. ‘పొలిమేర’ లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ప్రేక్షకులను షాక్ చేసే మలుపులు, ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించాను’.