హీరో నాని ఒక ఈవెంట్లో పాల్గొనగా.. ఒక స్టూడెంట్ ‘‘మీరు పెద్ద దర్శకులతో ఎందుకు సినిమాలు చేయడం లేదు’’అని ప్రశ్నించారు. దానికి నాని ‘‘మీరు అనుకుంటే పెద్ద హీరో సినిమాలు చూసేందుకు వెయిట్ చేయవచ్చు. నా కోసమే ఎందుకు థియేటర్‌కు వస్తున్నారు. మనసుకు నచ్చిన పని చేసుకుంటూ మనం వెళ్లిపోతున్నాం. అలాగే మనసుకు నచ్చిన సినిమాలు మీరు చూస్తున్నారు. నేనూ అంతే’’అని చెప్పారు.