ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో అలరిస్తున్న శృతిహాసన్..!

cinema |  Suryaa Desk  | Published : Sun, Nov 05, 2023, 11:12 AM
మోస్ట్ బ్యూటిఫుల్ నటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తన కెరియర్ ప్రారంభంలో తమిళ ... తెలుగు సినిమాలలో నటించింది.కాకపోతే శృతి తన కెరియర్ ప్రారంభంలో నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా ఫ్లాప్ అవుతూ రావడంతో ఈ నటికి ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. అలా వరుస అపజయాలు అందుకుంటున్న సమయం లోనే ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ నటికి మంచి గుర్తింపు లభించింది.


ఇక ఆ తర్వాత ఈ నటికి వరుస అవకాశాలు రావడం అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తూ రావడంతో ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు ఐరన్ లెగ్ అనే పేరు పోయి గోల్డెన్ లెగ్ అనే పేరు వచ్చింది. ఇకపోతే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ బ్యూటీ వీర సింహా రెడ్డి ... వాల్టేరు వీరయ్య మూవీ లతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాలను అందుకుంది.


ఇక ఈ సంవత్సరం ఈ ముద్దుగుమ్మ నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22 వ తేదీన విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే శృతి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా శృతి అదిరిపోయే క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని అంతే క్లాస్ అండ్ డీసెంట్ లో ఉన్న ఓ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com