డస్కీ బ్యూటీ, బుట్టబొమ్మ పూజా హెగ్డే సినిమాల కంటే ప్రైవేట్ ఈవెంట్లలోనే ఎక్కువగా మెరుస్తుంది. ఆమె కెరీర్లో ఇటీవల కొంత గందరగోళం నెలకొన్ని నేపథ్యంలో సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. పూజా హెగ్డే.. తాజాగా ముంబయిలో మెరిసింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంది. ప్రముఖ ఇండియన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన `దీపావళి బాష్`లో పూజా సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులంతా పాల్గొన్నారు. దాదాపు సగానికిపైగా సెలబ్రిటీలు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఎక్కువగా హీరోయిన్లు పాల్గొని అలరించారు. చాలా వరకు హీరోయిన్లు మనీష్ మల్హోత్రా డిజైనింగ్ వేర్లను ధరిస్తుంటారు. దీంతో వారికి చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ముంబయిలో నిర్వహించిన దివాళీ బాష్‌లో అందాల ముద్దుగుమ్మలంతా పాల్గొని సందడి చేశారు. ఇందులో పూజా హెగ్డే హైలైట్‌గా నిలిచింది. రెడ్ శారీ కట్టుకుని ఘాటు రేపే అందాలతో కట్టిపడేస్తుంది. టౌట్ బ్లౌజ్ ధరించి, పలుచని ఎర్రచీరలో మెరిసింది. రెడ్ శారీలో డస్కీ బ్యూటీ అందాలు మరింతగా ఘాటెక్కాయని చెప్పొచ్చు. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Pooja Hegde#PoojaHegde pic.twitter.com/9hBAn1qnly
— rocky (@rockyKristen001) November 6, 2023