టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా మూవీ మేకర్స్ ఈ విషయం గురించి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
ఈ సినిమాలో యాక్షన్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య గెటప్, సెటప్ చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. ఈ సినిమా యాక్షన్ డ్రామా కాదని ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa