‘దర్శకుడు మహేశ్‌రెడ్డిగారిని పది నిముషాల్లో టూకీగా కథ చెప్పమన్నాను. కానీ కథ ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో ఏకధాటిగా మూడు గంటలు విన్నాను. నాకు బాగా నచ్చింది. ఇందులో హీరో పాత్రకు ఆస్తమా ఉంటుంది, అందుకే పోలీస్ కావాలనే కోరిక ఉన్నా అర్హత లేకపోవడంతో క్లూస్ టీమ్‌లో జాయి న్ అవుతాడు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నీ దాదాపు ఒకే ఫార్మెట్‌లో ఉంటాయి. కానీ మా సినిమాలో ఎలాంటి క్లూస్ లేని ఓ కేసుని ఎలా పరిష్కరించారు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అదే ఈ సినిమాకు కొత్త పాయింట్’ అన్నారు హీరో కార్తీక్ రాజు. ఆయన నటించిన ‘అథర్వ’ చిత్రం డిసెంబర్ ఒకటిన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాకు చిత్రవిశేషాలు వెల్లడించారు. ‘ఇలాంటి జానర్‌లో నటించేటప్పుడు ఎక్స్‌ప్రెషన్స్ కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. మన నటన మీదే సినిమా అంతా ఆధారపడి ఉంటుంది కనుక ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇందులో క్రైమ్ జర్నలిస్టుగా సిమ్రన్ చౌదరి, సినిమా హీరోయిన్‌గా ఐరా నటించారు. నిర్మాత శ్రీనివా్‌సగారు ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు. బడ్జెట్ గురించి ఆలోచించకుండా మంచి సినిమా తీయమని చెప్పారు’ అని తెలిపారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని క్లూస్ టీమ్‌కు ఈ సినిమాను ప్రత్యేకంగా చూపించామనీ, వారంతా బాగా మెచ్చుకున్నారని కార్తీక్ రాజు చెప్పారు. ‘కౌసల్యా కృష్ణమూర్తి’ తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయని చెబుతూ ‘కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆచీతూచీ కథలు ఎన్నుకుంటున్నాను. డిసెంబర్ 7 నుంచి ఓ కొత్త సినిమా చేస్తున్నాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా పూర్తి చేశాను’ అని తెలిపారు.