తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు జరుగుతోంది. రాష్ట్రమంతటా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయటకి వస్తున్నారు, అలాగే ఇప్పుడు అందరి కళ్లు సినీ ప్రముఖుల మీద వున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈరోజు సాధారణ పౌరులుగానే వచ్చి లైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగిచుకుంటున్నారు. అదీ కాకుండా ప్రజలకు మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగిచుకోండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికన్నా ముందుగా ఓటు హక్కు వినియోగిచుకున్న సెలబ్రిటీ అల్లు అర్జున్ అని చెప్పొచ్చు.తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు ఎక్కువగా బంజరా హిల్స్, జూబిలీ హిల్స్ ప్రాంతంలో నివసిస్తూ వున్నారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా సినీ ప్రముఖులు అందరూ బయటకి వచ్చి క్యూలో నిలబడి తమ భాద్యతగా ఓటు వెయ్యడమే కాకుండా, ప్రజలకి కూడా ఓటు వెయ్యమని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ మొదలైన వెంటనే ఓటు వేసిన వారిలో అల్లు అర్జున్ ముందున్నారు. అతను పోలింగ్ మొదలైన మొదటి గంటలోనే ఓటు వెయ్యడమే కాకుండా అందరినీ ఇళ్లలోంచి బయటకి వచ్చి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.మెగా స్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి లైన్ లో నిలబడి మరీ ఓటు వేశారు. అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఓటు వేశారు. అలాగే నాగార్జున, భార్య అమల, కుమారుడు నాగ చైతన్యతో కలిసి పోలింగ్ బూతు బయట లైన్లో నిలుచొని వున్నా ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.అలాగే జూనియర్ ఎన్టీఆర్ అతని కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో వుండే నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. నటుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఓటు వెయ్యడమే కాకుండా, నా బాధ్యతగా నేను ఓటు వేసాను, మరి మీరు వేసారా అంటూ ఒక ఫోటో కూడా పెట్టారు.నటుడు, మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు తన భార్య ప్రియదర్శిని తో కలిసి వెళ్లి ఓటు వేశారు. సీనియర్ నటుడు వెంకటెష్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా చాలామంది సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగిచుకొని మొదటి రెండు మూడు గంటల్లోనే ఓటు వెయ్యడానికి ఉత్సాహం చూపించడం వలన ఓటు వెయ్యని వాళ్ళు కూడా బద్ధకించకుండా ఓటు హక్కుని వినియోగించుకుంటారని భావిస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల పద్మారావు నగర్, సికింద్రాబాదు లో ఓటు వేశారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు కూడా ఓటుహక్కును వినియోగిచుకున్న ప్రముఖుల్లో వున్నారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కూడా ఓటుహక్కును వినియోగిచుకున్నారు. 'పుష్ప' దర్శకుడు సుకుమార్, అతని భార్యతో కలిసి తొందరగానే వెళ్లి ఓటు వేసి రావటమే కాకుండా అందరినీ ఓటు హక్కును సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.