కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి దేవర అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ప్రస్తుతం అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.
తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా VFX కోసం దాదాపు 140 కోట్ల రూపాయలు దేవర టీమ్ ఖర్చు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఒరిజినల్ బడ్జెట్లో దాదాపు 33 శాతం స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం కేటాయించబడినాట్లు సమాచారం. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.