పోలూరు కృష్ణ దర్శకత్వంలో నటి అవికా గోర్ స్ట్రెయిట్ తెలుగు OTT సిరీస్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సిరీస్ కి మూవీ మేకర్స్ 'వధువు' అనే టైటిల్ ని లాక్ చేసారు. బెంగాలీ సిరీస్ ఇందు యొక్క అధికారిక రీమేక్ అయిన వధువు డిసెంబర్ 8, 2023 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
ఫ్యామిలీ డ్రామాగా సాగే ఈ సిరీస్ లో నందు, అలీ రెజా, రూప లక్ష్మి, మౌనిక, మాధవి ప్రసాద్ మరియు ఇతరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఎస్‌విఎఫ్ బ్యానర్‌పై శ్రీకాంత్ మోహతా మరియు మహేంద్ర సోని నిర్మించిన శ్రీరామ్ మద్దూరి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.