సల్మాన్ ఖాన్ మరియు కత్రినా కైఫ్ నటించిన YRF స్పై యూనివర్స్ నుండి ఇటీవల విడుదలైన టైగర్ 3 బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మంచి వసూళ్లను రాబట్టినప్పటికీ టైగర్ ఫ్రాంచైజీలోని ఇతర చిత్రాల కంటే ఈ సినిమా కలెక్షన్స్ తక్కువగానే ఉన్నాయి. YRF అత్యంత భారీ మల్టీస్టారర్ షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ నటించిన పఠాన్ Vs టైగర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రం మార్చి 2024లో సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. అయితే టైగర్ 3 ఫలితం కారణంగా ఈ సినిమా ఆగింది. చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా స్క్రిప్ట్ ని మెరుగుపరచడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఈ చిత్రం అక్టోబర్ 2024 నుండి షూటింగ్ ప్రారంభించనుంది అని సమాచారం.
ప్రస్తుతానికి, షారుక్ ఖాన్ ఇప్పటికే ఉన్న తన కమిట్మెంట్లను పూర్తి చేశాడు. మరోవైపు, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బిల్లా మరియు షేర్షా ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో 'ది బుల్' లో పనిచేస్తున్నారు. టైగర్ Vs పఠాన్ కోసం ఇద్దరు స్టార్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.