యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని, దర్శకుడు చందూ మొండేటి.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తండేల్’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మూడో చిత్రంగా తెరకెక్కబోతోన్న ‘తండేల్’ చిత్రం.. నాగ చైతన్య కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్ చిత్రంగా నిలవబోతోంది. శనివారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముహూర్తపు షాట్‌కు నాగార్జున కెమెరా స్విచాన్ చేయగా, వెంకటేష్ క్లాప్ కొట్టారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు.