ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ వచ్చినట్లు లేటెస్ట్ టాక్. ఈ సినిమాలో మితిమీరిన హింస ఉందని సెన్సార్ బోర్డ్ సభ్యులు అభిప్రాయపడ్డారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.