కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ప్రస్తుతం అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.
తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ హీరో శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... దేవర చాలా చక్కగా రూపొందుతుందని ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావస్తోందని వెల్లడించారు. విడుదల గురించి అడిగినప్పుడు, శ్రీకాంత్ దేవర విడుదలలో ఎటువంటి ఆలస్యం జరగదని మరియు చిత్రం ఏప్రిల్ 5, 2024 న విడుదలవుతుందని ధృవీకరించారు.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, తారక్ పొన్నప్ప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.