బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె అభిషేక్ బచ్చన్ ఇంటి నుండి బయటకు వెళ్లి తన తల్లి వద్ద తన కుమార్తెతో ఒంటరిగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్ మరియు అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, యాష్ తన అత్తవారింటిలో ఉండటం లేదని అయితే విడాకుల ప్రశ్నే లేదని వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం, బచ్చన్ కుటుంబం మొత్తం అగస్త్య నంద (అమితాబ్ మనవడు) తొలి చిత్రం ది ఆర్చీస్ ప్రీమియర్లో కనిపించారు. మరి రానున్న రోజుల్లో ఈ విడాకుల విషయంపై బచ్చన్ ఫ్యామిలీ ఏం చెబుతుందో చూడాలి.