నయనతార నటించిన 'అన్నపూర్ణి' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. చెఫ్ కావాలనే ఓ బ్రాహ్మణ యువతి కథతో లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా నీలేష్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నయన హీరోయిన్ కావడంతో సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నయనతార ఓ అర్చకుడి కూతురిగా కనిపించింది. తన తండ్రి ద్వారా చిన్నతనం నుంచి వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది. చెఫ్ కావాలని కలలు కంటుంది. కానీ తన తల్లిదండ్రులు అందుకు నిరాకరిస్తారు. వారికి తెలియకుండా స్నేహితుడు ఫరాన్ చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది. ఆ తర్వాత తన కోరిక తీరిందా? లేదా అన్నది ఇతర కథ. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సొంతం చేసుకోలేదు. దాంతో నయనతారకు నిరాశే మిగిలింది. అయితే ఈ చిత్రం విడుదలై నెల కాక ముందే ఓటీటీలో దర్శనమివ్వనుంది. థియేటర్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 దక్కించుకున్నట్లు సమాచారం. ఈ నెల 29న అన్నపూర్ణి చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళ్ తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అన్నపూర్ణి స్ర్టీమింగ్ కానున్నట్లు సమాచారం.