ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ఫైనల్స్‌ వలన గందరగోళం

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 20, 2023, 03:27 PM

బిగ్‌బాస్‌ సీజన్‌ 7  ఫైనల్స్‌ సందర్భంగా అన్నపూర్ణ 7 ఏకర్స్ వద్ద జరిగిన గొడవ, విధ్వంసం విషయంలో A1 పల్లవి ప్రశాంత్, A2 ప్రశాంత్ సోదరుడు, A3 వినయ్, A4 డ్రైవర్ సాయికిరణ్, A5‌గా రాజుని నిందితులుగా పరిగణిస్తూ.. పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో డ్రైవర్ సాయికిరణ్, రాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుండగా.. విన్నర్ పల్లవి ప్రశాంత్   మాత్రం పరారీలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో మరికొంతమంది నిందితులు చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పుడో ట్విస్ట్ నడుస్తోంది. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో చెబితే బెయిల్‌కి దరఖాస్తు చేస్తామని.. పల్లవి ప్రశాంత్ లాయర్ పోలీసులను సంప్రదించగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం లేదంటూ ఆయన మీడియాకు తెలియజేశారు. పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ..... ‘‘పల్లవి ప్రశాంత్‌పై నమోదు అయిన కేసు ఎఫ్ఐఆర్ వివరాలను అడిగాం. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం లేదు. పబ్లిక్ డొమైన్‌లో పెట్టాల్సిన ఎఫ్ఐఆర్ కాపీని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీ‌లో ఉన్నాడని, ఎఫ్ఐఆర్  కాపీ కోసం కుటుంబ సభ్యులు రావాలని ఇన్‌స్పెక్టర్ చెబుతున్నారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో ఎఫ్ఐఆర్ కాపీ చూస్తేనే తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ కాపీ లేకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేక పోతున్నాము..’’ అని అడ్వకేట్ రాజేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. మరో వైపు బిగ్ బాస్ షో పై కూడా కేసులు నమోదవుతున్నాయి. చూస్తుంటే, ఈ వ్యవహారం ముందు ముందు మరింత ముదిరేలానే కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com