సందీప్ రెడ్డి వంగాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం కథ ఇంకా లాక్ చేయలేదని ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించారు. బాలీవుడ్ మీడియాతో ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్, సందీప్ ఇద్దరి చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ సినిమాలు పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించగలం. అల్లు అర్జున్ ఇమేజ్‌కి తగ్గ కథతో రావాలి. ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో నేను చెప్పలేను, కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.