జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన 'నెరు' సినిమా డిసెంబర్ 21న విడుదల అయ్యింది. ఈ కోర్టు రూమ్ డ్రామా విమర్శకులు మరియు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూస్ ని అందుకుంటుంది. సాలార్ వంటి పెద్ద సినిమాతో విడుదలైన నేరు కేరళ బాక్సాఫీస్ వద్దే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. నెరు ఓవర్సీస్ నుండి దాదాపు 3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసింది.
ఈ సినిమాలో మోహన్ లాల్ క్రిమినల్ లాయర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆంటోని పెరుంబావూర్ మరియు ప్రియామణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నెరు చిత్రాన్ని మోహన్‌లాల్ స్వంత బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ నిర్మిస్తుంది.