ఛలో సినిమాతో కథానాయికగా పరిచయమైన రష్మిక వరుస విజయాలతో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో మహేష్ బాబు, అల్లుఅర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన రష్మిక ఇటీవల వచ్చిన యానిమల్ తో సూపర్ హిట్ అందుకుంది. అమ్మాయిలు అందంగా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పింది రష్మిక. ఎక్కువ ప్రయాణం చేయడం, నిద్ర లేకపోవడం వల్ల చర్మం దెబ్బ తింటుందని పేర్కొంది.