తెలుగు ప్రజలకు నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలుగు వారి సంసృతీ సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. పండుగకు కళాకళలాడాల్సిన పల్లెటూర్లు నేడు సైకో పాలనలో వలసలతో వెలవెలబోతున్నాయి. త్వరలోనే పేదల ప్రభుత్వం, రైతురాజ్యం వస్తుంది. వచ్చే సంక్రాంతికి రాతియుగం అంతరించి రాష్ట్రానికి స్వర్ణయుగం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరీకీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.