తల అజిత్ ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో నటిస్తున్నారు. నెర్కొండ పరవాయ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈచిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ నటి విద్యాబాలన్ పాల్గొంటుంది. ఈ సినిమాలో ఆమె ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ ఒరిజినల్ వెర్షన్ లో తాప్సి నటించిన పాత్రలో నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలకానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa