‘మజలీ’ సినిమా శుక్రవారం విడుదల కాబోతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారిని సినీ నటులు నాగచైతన్య, సమంత దంపతులు దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వీరితో పాటు హాస్యనటుడు బ్రహ్మానందం కూడా స్వామివారిని దర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa