నయనతార 'అన్నపూర్ణి' చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ నుంచి తొలిగించటంపై తాజాగా దర్శకుడు వెట్రిమారన్ స్పందించాడు. అన్నపూర్ణి సినిమా విషయంలో నెట్ ఫ్లిక్స్ నిర్ణయం సరైనది కాదని అన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ పొందిన ఒక చిత్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఓటీటీ నుంచి తొలగించటం చిత్ర పరిశ్రమకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఒక సినిమాను అనుమతించడానికైనా, నిషేధించడానికైనా కేవలం సెన్సార్ బోర్డుకు మాత్రమే అధికారం ఉందన్నారు.