తన వైవాహిక జీవితం గురించి నటి సమంత పరోక్షంగా కామెంట్స్ చేశారు. ‘‘నా ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలమయ్యాను. దానిని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఎందుకంటే గతంలో నా భాగస్వామి వాటిని ప్రభావితం చేశాడు. ఆ తర్వాత క్లిష్ట సమయం నుంచే మనం విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైంది. ఈ విషయాన్ని గ్రహించిన తర్వాతే నా వ్యక్తిగత ఎదుగుదల మొదలైంది’’ అని అన్నారు.