హీరోయిన్ అంజలి ప్రస్తుతం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి ముద్దు సన్నివేశాల్లో నటించడంపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇద్దరు ప్రేమికుల మధ్య రియల్ లైఫ్లో ఉండే కెమిస్ట్రీకి.. రీల్ లైఫ్ కెమిస్ట్రీకి చాలా తేడా. ముద్దు సన్నివేశాల్లో నటించాలంటే ఇబ్బందిగా ఉంటుంది. తప్పనిసరి అనుకున్నప్పుడు ఇష్టం లేకున్నా చేయాల్సిందే’ అని చెప్పింది.