మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. కొద్దిరోజుల క్రితమే ఈ పాన్-ఇండియన్ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'ది రాజా సాబ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.
IMDb రిపోర్ట్ ప్రకారం, ఈ చిత్రం ప్రేమలో పడిన జంట గురించి కానీ ప్రతికూల శక్తి విధిని మారుస్తుంది అని ఉంది. IMDb పేజీలో పేర్కొన్న సమాచారం పూర్తిగా తప్పు అని దర్శకుడు మారుతి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని మారుతీ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ప్రభాస్ అభిమానులు తదుపరి అప్డేట్ ఇవ్వమని దర్శకుడిని అడగడం ప్రారంభించారు.
క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ జోడిగా కనిపించనుంది. అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా 2024లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ హారర్-కామెడీ డ్రామాకి థమన్ సంగీతం అందించనున్నారు.