మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ రామందిర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనేందుకు అయోధ్యకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తన ఇష్టదైవం హనుమంతుడే ఈ ఆహ్వానం పంపినట్టు భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమమని, తనకు ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయని తెలిపారు. అలాగే ఈ వేడుకలో పాల్గొనబోతుండటం ఎంతో గౌరవంగా ఉందని రామ్ చరణ్ చెప్పారు.