ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌పై స్టేను తెలంగాణ హైకోర్టు పొడిగించింది. మరో మూడు వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు వారాల్లోగా పునఃపరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ సినిమా తీశారని సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని నారా లోకేష్ ఈ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.