అధిక బరువు తగ్గించుకునేందుకు చేసే లైపోసక్షన్ సర్జరీ వికటించి బ్రెజిల్ పాప్ సింగర్ డానీ లీ (42) చనిపోయింది. లైపోసక్షన్ అయ్యాక ఆమెకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించి ఆమె కన్నుమూసింది. ఊబకాయం బారిన పడిన వారు శరీరంలో కొవ్వు తగ్గించుకునేందుకు లైపోసక్షన్ చేయించుకుంటారు. ఇవి వికటించి రక్తం గడ్డ కట్టడంతో ఎక్కువ మంది చనిపోతున్నారు.