జూబ్లీహిల్స్‌లోని డెక్కన్ కిచన్ కూల్చివేత విషయంలో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో హీరో వెంకటేశ్, సురేష్ బాబు, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఫిలింనగర్ పోలీసులు వారిపై పలు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. కోట్ల విలువైన డెక్కన్ కిచన్ బిల్డింగ్ ధ్వంసం చేసి ఫర్నీచర్ ఎత్తుకెళ్లారని నంద కుమార్ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు తాజా ఆదేశాలిచ్చింది.