ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాక్స్ ఆఫీస్: 'మజిలీ' బ్లాక్ బస్టర్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2019, 12:23 PM

నాగచైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమా థియేటర్స్ కి వచ్చింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన థియేటర్స్ కి వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున ఈ సినిమా 11.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. నాగచైతన్య కెరియర్లోనే తొలిరోజున ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు.

ఇక రెండవ రోజున ఈ సినిమా 10 కోట్ల వరకూ వసూళ్లను సాధించింది. అలా రెండు రోజుల్లో ఈ సినిమా 21.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ తో రావడం .. ముఖ్యంగా పెళ్లి తరువాత చైతూ .. సమంత కలిసి చేసిన తొలి సినిమా కావడం వలన, ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చైతూ .. సమంత హిట్ కొట్టేశారంటూ ఆ జంటకి అభినందనలు తెలియజేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa