ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిమాక్‌ ఖరాబ్‌ అంటున్న ఇస్మార్ట్ శంకర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2019, 12:15 PM

దిమాక్‌ ఖరాబ్‌…అంటూ సాగే పాటను ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం కోసం చిత్రీకరిస్తున్నారు. రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ నాయకానాయికలుగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా నిర్మించిన ఓ భారీ సెట్లో పై పాటను తీస్తున్నారు. తెలంగాణ యాసలో సాగే ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్‌ రచించగా…చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ బాణీలను అందించారు. నిధి అగర్వాల్‌తో పాటు వందమంది డ్యాన్సర్లు ఈ పాట చిత్రీకరణలో పాల్గొనగా…శేఖర్‌ నృత్యరీతులను అందిస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన నిధి అగర్వాల్‌ స్టిల్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇటీవల ఈ పాట కోసం నిర్మించిన సెట్‌ను దర్శకుడు సుకుమార్‌ తిలకించి…సరికొత్త స్టైల్‌లో ఉన్న రామ్‌ లుక్‌ను, సాంగ్‌ చిత్రీకరణను అభినందించినట్లు చిత్రబృందం తెలిపింది. వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు వేగవంతంగా జరుగుతున్నా యని వారు వెల్లడించారు. ఇంకా ఈ చిత్రంలో పునీత్‌ ఇస్సార్‌, సత్యదేవ్‌, మిలింద్‌ గునాజి, ఆశిష్‌ విద్యార్థి, గెటప్‌ శ్రీను, సుధాంశుపాండే తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సాహిత్యం: భాస్కరభట్ల, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: రాజ్‌ తోట, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ, నిర్మాతలు: పూరి జగన్నాథ్‌, ఛార్మికౌర్‌, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa