తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:05 గంటలకు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు అనుమతినిచ్చారు.ముందుగా ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు, ప్రత్యేక హారతులు, నివేదనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ జీయంగార్లు, అర్చకులు, టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వార ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ... "అనుకున్న సమయం కంటే ముందుగానే భక్తుల కోసం దర్శనాలు ప్రారంభించాం. ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం" అని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa