విజయ్ దేవరకొండపై నటి రష్మిక ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘కెరీర్లో నేను ఎంతో కష్టపడే వచ్చాను. నేను చేసే ప్రతి పనిలో విజయ్ సహకారం ఎప్పుడూ ఉంటుంది. నేను ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటే ఆ సమయంలో తప్పకుండా అతని సలహా తీసుకుంటాను. వ్యక్తిగతంగా నా జీవితంలో అందరికంటే ఎక్కువగా సపోర్ట్ చేసిన వ్యక్తి విజయ్’’అని రష్మిక తెలిపింది.
ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే తన డీప్‌ఫేక్ వీడియోపై స్పందించినట్లు హీరోయిన్ రష్మిక తెలిపారు. ‘‘ డీప్‌ఫేక్ ఎంతో ఒత్తిడి కలిగిస్తుంది. భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది’’ అని రష్మిక అన్నారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ రష్మిక ఆవేదన చెందారు. ఇటీవల ఈ కేసులో అనుమానితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప 2’లో నటిస్తున్నారు.