హాట్ యాక్ట్రెస్ పూనమ్ పాండే(32) ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్‌తో కన్నుమూశారు. 2013లో విడుదలైన నషా చిత్రంతో పూనమ్ పాండే తొలిసారిగా నటించింది. అయితే ఆమె అకాల మరణ వార్త ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు.
పూనమ్ పాండే సెర్వికల్ క్యాన్సర్‌తో మరణించినట్లు ఆమె టీం ప్రకటించింది. సెర్వికల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆడవారిలో వచ్చే ఈ క్యాన్సర్ ప్రమాదకరమైనదిగా వైద్యనిపుణులు చెబుతున్నారు. 30 నుంచి 45 ఏళ్ల వయసు గలవారికి ప్రధానంగా ఈ క్యాన్సర్ సోకుతుంది. ఈ క్యాన్సర్ సోకడానికి డాక్టర్లు ప్రధానంగా చెబుతున్న కారణం సెక్సువల్ ఇన్ఫెక్షన్స్ అని అంటున్నారు.