బాలీవుడ్ నటి పూనమ్ పాండే గత కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతూ గురువారం రాత్రి మరణించారు. 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ సమయంలో భారత్ గెలిస్తే నగ్నంగా తిరుగుతానని పూనమ్ కౌర్ ప్రకటించారు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు విజేతగా నిలబడటంతో పూనమ్ పాండే తన మాటను నిలబెట్టుకునేందుకు నగ్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది.
పూనమ్ పాండే సెర్వికల్ క్యాన్సర్తో మరణించినట్లు ఆమె టీం ప్రకటించింది. సెర్వికల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆడవారిలో వచ్చే ఈ క్యాన్సర్ ప్రమాదకరమైనదిగా వైద్యనిపుణులు చెబుతున్నారు. 30 నుంచి 45 ఏళ్ల వయసు గలవారికి ప్రధానంగా ఈ క్యాన్సర్ సోకుతుంది. ఈ క్యాన్సర్ సోకడానికి డాక్టర్లు ప్రధానంగా చెబుతున్న కారణం సెక్సువల్ ఇన్ఫెక్షన్స్ అని అంటున్నారు.