పూనమ్ కౌర్.. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల తార. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె తాజాగా ఓ టీవీ షోలో పాల్గొని గత రెండేళ్లుగా ఫైబ్రోమైయాల్జియా వ్యాధి తనను బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పారు. 'ఈ వ్యాధితో చాలా ఇబ్బంది పడ్డా. కనీసం దుస్తులు కూడా వేసుకోలేకపోయా. అవి ధరిస్తున్నప్పుడు నొప్పులు వచ్చేవి. ఎప్పుడూ వదులుగా ఉన్న దుస్తులనే ధరించాల్సి వచ్చేది' అని పూనమ్ తెలిపారు.